26 వేల ఐస్‌క్రీం పుల్లలతో రంగోలి

భారత్‌కు చెందిన తల్లీకూతుళ్లు సింగపూర్‌లో 26 వేల ఐస్‌క్రీం పుల్లలతో రంగోలి కళాకృతి వేసి సింగపూర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు.

Published : 28 Jan 2023 06:35 IST

సింగపూర్‌: భారత్‌కు చెందిన తల్లీకూతుళ్లు సింగపూర్‌లో 26 వేల ఐస్‌క్రీం పుల్లలతో రంగోలి కళాకృతి వేసి సింగపూర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. తమిళ సంస్కృతి ఉట్టి పడేలా సుధా రవి, ఆమె కుమార్తె రక్షిత ముగ్గులు వేస్తుంటారు. దీనికోసం ప్రతిసారి బియ్యం పిండి, చాక్‌, చాప్‌ స్టిక్స్‌ను ఉపయోగించి ముగ్గులు వేస్తుండేవారు. అయితే ఈ సారి మాత్రం విభిన్నంగా నెలపాటు శ్రమించి 26వేల ఐస్‌క్రీం పుల్లలతో తమిళ కవులు-పండితులైన తిరువళ్లువర్‌, అవ్వైయార్‌, భారతీయార్‌, భారతీదాసన్‌ చిత్రాలను వేశారు. కళామంజరి అనే సంస్కృత సంస్థ లిషా అనే సంఘంతో కలిసి ఈ రంగోలి కార్యక్రమాన్ని నిర్వహించింది. 3,200 చదరపు అడుగుల ముగ్గు వేసి 2016లోనే సుధా రికార్డు సృష్టించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని