రష్యా దాడిలో 10 మంది మృతి

రష్యా జరిపిన క్షిపణి, డ్రోన్‌ దాడుల్లో తమ దేశానికి చెందిన సుమారు 10 మంది పౌరులు మరణించినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది.

Updated : 28 Jan 2023 05:54 IST

20 మంది పౌరులకు గాయాలు

కీవ్‌: రష్యా జరిపిన క్షిపణి, డ్రోన్‌ దాడుల్లో తమ దేశానికి చెందిన సుమారు 10 మంది పౌరులు మరణించినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. మరో 20 మంది గాయపడినట్లు వెల్లడించింది. ఈ మేరకు దేశ అధ్యక్ష కార్యాలయం శుక్రవారం తెలిపింది. మరణించిన వారిలో ఖేర్సన్‌కు చెందిన ఇద్దరు, దోనెట్స్క్‌ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఉన్నారని వివరించింది. గురువారం రష్యా జరిపిన దాడుల్లో 11 మంది మృతి చెందారు. తమ దేశాలకు చెందిన అత్యాధునిక యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్‌కు అందించడానికి నిర్ణయించినట్లు అమెరికా, జర్మనీ ప్రకటించిన నేపథ్యంలో రష్యా తన దాడులను ఉద్ధృతం చేసింది. పాశ్చాత్య దేశాలు తమతో కొత్త స్థాయి ఘర్షణకు దిగుతున్నాయని ఆరోపించింది. మరోపక్క తమ దేశంలో కలిపేసుకున్నట్లు ప్రకటించిన ఉక్రెయిన్‌ భూభాగాలైన దోనెట్స్క్‌, లుహన్స్క్‌, జపోరిజియా, ఖేర్సన్‌లను మాస్కో టైమ్‌ జోన్‌లోకి తీసుకువస్తున్నట్లు రష్యా అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకూ అవి కీవ్‌ టైమ్‌ జోన్‌లో ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు