బ్రిటన్‌లో దొరికిన హరిందర్‌ తాఖర్‌ మృతదేహం

గత ఏడాది నుంచి ఆచూకీ తెలియకుండా పోయిన భారత సంతతి వ్యక్తి హరిందర్‌ తాఖర్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

Published : 30 Jan 2023 04:50 IST

గతేడాది తప్పిపోయిన భారత సంతతి వ్యక్తి

లండన్‌: గత ఏడాది నుంచి ఆచూకీ తెలియకుండా పోయిన భారత సంతతి వ్యక్తి హరిందర్‌ తాఖర్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఉడ్‌లాండ్‌లో నివాసం ఉండే 58ఏళ్ల హరిందర్‌.. గత ఏడాది అక్టోబరులో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ క్రమంలో ఆయన తప్పిపోయాడంటూ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెల్‌ఫ్రాడ్‌ వద్ద ఒక మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు తాజాగా ఆయనే హరిందర్‌గా నిర్ధరించారు. ఈయన కోసం గత కొన్ని నెలలుగా పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. ఈయన ఆచూకీ తెలియాలని.. కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తూ సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం సైతం జరిగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని