ఇరాన్‌లో భూకంపం.. ఏడుగురి మృతి

ఇరాన్‌, తుర్కియే, పాకిస్థాన్‌ ప్రజలను ఆదివారం భూకంపం వణికించింది. ఇరాన్‌ - తుర్కియే సరిహద్దులో 5.9 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి అజర్‌ బైజాన్‌ ప్రావిన్సులోని కోయ్‌ నగరంలో ఏడుగురు మరణించగా.. 440 మంది గాయపడ్డారు. పెద్దసంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి.

Published : 30 Jan 2023 04:50 IST

పాక్‌, తుర్కియేల్లోనూ వణికిన జనం

టెహ్రాన్‌, ఇస్లామాబాద్‌: ఇరాన్‌, తుర్కియే, పాకిస్థాన్‌ ప్రజలను ఆదివారం భూకంపం వణికించింది. ఇరాన్‌ - తుర్కియే సరిహద్దులో 5.9 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి అజర్‌ బైజాన్‌ ప్రావిన్సులోని కోయ్‌ నగరంలో ఏడుగురు మరణించగా.. 440 మంది గాయపడ్డారు. పెద్దసంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాలు మీద పడి కొందరు మరణించగా.. తప్పించుకునే ప్రయత్నంలో భవనాలపై నుంచి దూకి ఎక్కువమంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టిన విపత్తు నిర్వహణ బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మంచు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.

పాక్‌లో 6.3 తీవ్రతతో.. పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో ఉన్న అటక్‌ నగర సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 6.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. తజికిస్థాన్‌ వద్ద 150 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పాక్‌లోని ఇస్లామాబాద్‌, రావల్పిండి తదితర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయని.. ప్రాణనష్టం జరిగినట్లు తక్షణ సమాచారం ఏదీ లేదని రేడియో పాకిస్థాన్‌ తెలిపింది. భూకంపాలకు అనుకూల ప్రాంతమైన పాకిస్థాన్‌లో 2005లో వచ్చిన భారీ భూకంపం 74,000 మందికి పైగా ప్రజల ప్రాణాలను బలిగొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని