Imran khan: ఇమ్రాన్‌ సంచలన నిర్ణయం.. 33 ఎంపీ స్థానాల్లో ఒక్కడే పోటీ

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Updated : 31 Jan 2023 09:33 IST

లాహోర్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాతీయ అసెంబ్లీలో ఖాళీ అయిన 33 స్థానాలకు మార్చి 16న ఉప ఎన్నికలు జరగనుండగా, అన్ని చోట్లా ఆయనే పోటీ చేయనున్నారు. ఆదివారం జరిగిన పీటీఐ కోర్‌ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు పార్టీ ఉపాధ్యక్షుడు షా మహమూద్‌ ఖురేషీ వెల్లడించారు. ముందస్తు ఎన్నికల విషయంలో అధికార కూటమిపై మరింత ఒత్తిడి పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

గతేడాది ఏప్రిల్‌లో జరిగిన విశ్వాస పరీక్షలో ఓటమితో ఇమ్రాన్‌ ప్రధాని పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇమ్రాన్‌ ఆదేశాల మేరకు నేషనల్‌ అసెంబ్లీలోని పీటీఐ సభ్యులందరూ రాజీనామా చేశారు. ఇప్పటివరకూ 70 మంది రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించారు. ఖాళీ అయిన స్థానాలకు సంబంధించి తొలుత 33 చోట్ల ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. వీటిలో అన్ని చోట్లా పీటీఐ నుంచి ఇమ్రాన్‌ పోటీ చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని