రష్యా దాడి.. ఉక్రెయిన్‌లో అయిదుగురి మృతి

రష్యా జరిపిన తాజా దాడిలో తమ దేశానికి చెందిన అయిదుగురు పౌరులు మరణించారని ఉక్రెయిన్‌ అధికారులు సోమవారం వెల్లడించారు.

Published : 31 Jan 2023 05:24 IST

 మరో 13 మందికి గాయాలు

కీవ్‌: రష్యా జరిపిన తాజా దాడిలో తమ దేశానికి చెందిన అయిదుగురు పౌరులు మరణించారని ఉక్రెయిన్‌ అధికారులు సోమవారం వెల్లడించారు. మృతుల్లో ఓ మహిళ ఉన్నారని, 13 మంది గాయపడ్డారని తెలిపారు. దక్షిణ ప్రాంత నగరం ఖేర్సన్‌ కూడా రష్యా దాడులకు గురవుతోందని చెప్పారు. తాజా దాడుల్లో కొన్ని నివాస భవనాలు, ఓ ఆసుపత్రి, పాఠశాల, బస్‌స్టేషన్‌, బ్యాంకు, పోస్టాఫీస్‌లు ధ్వంసమయ్యాయని వివరించారు. మరోపక్క ఉక్రెయిన్‌ తూర్పు భాగంలో క్రెమ్లిన్‌, కీవ్‌లకు చెందిన దళాలు ఒకదానితో మరోటి తలపడుతున్నాయి. ప్రస్తుత శీతల వాతావరణంలో మార్పు వచ్చిన తరువాత వాటి బలాబలాల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని