అక్కడ పెళ్లికాకపోయినా పిల్లల్ని కనొచ్చు

జనాభా తగ్గుదల చైనాను కలవరపెడుతోంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న డ్రాగన్‌ ఆశలకు ఈ పరిస్థితి గండికొట్టేలా కనిపిస్తోంది.

Updated : 31 Jan 2023 08:24 IST

చైనాలోని సిచువాన్‌ ప్రావిన్సు అనుమతి
జనాభా తగ్గుదల నేపథ్యంలో నిర్ణయం

బీజింగ్‌: జనాభా తగ్గుదల చైనాను కలవరపెడుతోంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న డ్రాగన్‌ ఆశలకు ఈ పరిస్థితి గండికొట్టేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని సిచువాన్‌ ప్రావిన్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అక్కడ పెళ్లికాని వారు కూడా చట్టబద్ధంగా పిల్లల్ని కలిగి ఉండటానికి వెసులుబాటు కల్పించింది. దీంతోపాటు వివాహితులు పొందే ప్రయోజనాలన్నీ వారికీ అందుతాయి. ఫిబ్రవరి 15 నుంచి ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. ఇప్పటివరకూ వివాహితులు మాత్రమే చట్టబద్ధంగా పిల్లలకు జన్మనివ్వడానికి అనుమతి ఉండేది. ఇకపై వివాహం కాని ఒంటరి వ్యక్తి పిల్లలు కావాలనుకుంటే సంబంధిత అధికారుల వద్ద రిజిస్టర్‌ చేసుకోవచ్చు. సంతానం సంఖ్య విషయంలోనూ ఎలాంటి పరిమితి ఉండబోదు. దీర్ఘకాలిక, సమతుల్యతతో కూడిన జనాభా అభివృద్ధిని ప్రోత్సహించడమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశమని సిచువాన్‌ ఆరోగ్య కమిషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని