పెషావర్‌ ఘటనలో 100కు చేరిన మృతుల సంఖ్య

పాకిస్థాన్‌లోని పెషావర్‌ మసీదులో సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో మృత్యువాత పడిన వారి సంఖ్య 100కి చేరింది.

Published : 01 Feb 2023 04:54 IST

ఆత్మాహుతికి పాల్పడిన ఉగ్రవాది తల లభ్యం

పెషావర్‌, దిల్లీ: పాకిస్థాన్‌లోని పెషావర్‌ మసీదులో సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో మృత్యువాత పడిన వారి సంఖ్య 100కి చేరింది. 50 మందికి పైగా క్షతగాత్రులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని అధికారులు ప్రకటించారు. ప్రాణాలతో ఉన్న మరో తొమ్మిది మందిని శిథిలాల కింద గుర్తించి కాపాడారు. ఆత్మాహుతికి పాల్పడినట్లు భావిస్తున్న ఉగ్రవాదికి చెందిన తల భాగాన్ని అధికారులు మంగళవారం గుర్తించారు. అతడిని మొహ్మంద్‌ జిల్లాకు చెందిన 37 ఏళ్ల మొహ్మద్‌ అయాజ్‌గా గుర్తించారు. శిథిలాల తొలగింపు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు నాలుగు అంచెల భద్రతా వలయాన్ని దాటుకుని ఉగ్రవాది మసీదుకు ఎలా చేరుకున్నాడనేది దర్యాప్తు బృందాలకు మిస్టరీగా మారింది. ప్రభుత్వ వాహనంలోనే అతడు మసీదుకు చేరుకున్నట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందు నుంచే సమీపంలో ఉన్న పోలీసు క్వార్టర్స్‌లో నివసిస్తూ ఉండొచ్చని భావిస్తున్నారు. ఆత్మాహుతి దాడికి సుమారు 10 నుంచి 12 కేజీల పేలుడు పదార్థాన్ని ఉపయోగించి ఉంటాడని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని