మయన్మార్‌లో మరో ఆరు నెలలు సైనిక పాలనే

ప్రస్తుతం అమలులో ఉన్న అత్యయిక స్థితిని మరో ఆరునెలల పాటు పొడిగిస్తున్నట్లు మయన్మార్‌లో అధికారంలో ఉన్న సైనిక   ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.

Published : 02 Feb 2023 05:26 IST

అత్యయిక స్థితిని పొడిగిస్తూ నిర్ణయం

బ్యాంకాక్‌: ప్రస్తుతం అమలులో ఉన్న అత్యయిక స్థితిని మరో ఆరునెలల పాటు పొడిగిస్తున్నట్లు మయన్మార్‌లో అధికారంలో ఉన్న సైనిక   ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఆగస్టులో జరగాల్సిన ఎన్నికలను జాప్యం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనపడుతోంది. మంగళవారం సమావేశమైన జాతీయ రక్షణ, భద్రతా మండలి (ఎన్‌ఎస్‌డీసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి మరికాస్త సమయం పడుతుందని ఎన్‌ఎస్‌డీసీ తన ప్రకటనలో వెల్లడించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని