డోభాల్‌ పర్యటన ద్వారా అమెరికాతో దృఢ భాగస్వామ్యం

క్వాంటమ్‌, సెమీకండక్టర్‌ ఇంజినీరింగ్‌ వంటి అత్యాధునిక రంగాల్లో భారత్‌ అమెరికాల భాగస్వామ్యాన్ని దృఢపరిచే దిశగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ పర్యటన సాగిందని యూఎస్‌లోని భారత రాయబార కార్యాలయం మంగళవారం ప్రకటించింది.

Published : 02 Feb 2023 05:26 IST

భారత రాయబార కార్యాలయం వెల్లడి

వాషింగ్టన్‌: క్వాంటమ్‌, సెమీకండక్టర్‌ ఇంజినీరింగ్‌ వంటి అత్యాధునిక రంగాల్లో భారత్‌ అమెరికాల భాగస్వామ్యాన్ని దృఢపరిచే దిశగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ పర్యటన సాగిందని యూఎస్‌లోని భారత రాయబార కార్యాలయం మంగళవారం ప్రకటించింది. గత మూడు రోజులుగా అమెరికాలో పర్యటిస్తున్న భారత ఉన్నత స్థాయి బృందానికి డోభాల్‌ నేతృత్వం వహిస్తున్నారు. యూఎస్‌ భద్రతా సలహాదారు జేక్‌ సలివాన్‌తో పాటు ఇతర ప్రభుత్వ, విద్యా, వ్యాపార, పరిశోధనా రంగాల ప్రముఖులతో ఈ బృందం పలు చర్చల్లో పాల్గొని ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇస్రో, నాసా అధిపతుల ఆధ్వర్యంలో మంగళవారం సివిల్‌ స్పేస్‌ జాయింట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశం జరిగింది. అంతరిక్ష రంగంలో ఇరు దేశాల భాగస్వామాన్ని ఉన్నత కక్ష్యల్లోకి చేర్చేలా సమావేశం జరిగిందని అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్‌ సింగ్‌ ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు