12 మంది భార్యలు.. సెంచరీ దాటిన పిల్లలు!

ఓ వ్యక్తి ఏకంగా 12 మందిని వివాహం చేసుకుని 102 మంది పిల్లలను కనేశాడు. ఇక పిల్లలు వద్దు బాబోయ్‌ అంటున్నాడు.

Updated : 03 Feb 2023 08:25 IST

ఓ వ్యక్తి ఏకంగా 12 మందిని వివాహం చేసుకుని 102 మంది పిల్లలను కనేశాడు. ఇక పిల్లలు వద్దు బాబోయ్‌ అంటున్నాడు. ఉగాండాలోని బుగిసాలో నివసిస్తున్న అతడి పేరు ముసా హసహ్య. ఆయనకు రెండెకరాల భూమి ఉంది. వంద మందికిపైగా ఉన్న కుటుంబ సభ్యులకు సరిపోయే ఆహారం, దుస్తులు వంటివి సమాకూర్చలేకపోతున్నాడు. దీంతో విసుగు చెందిన ఇద్దరు భార్యలు ఇటీవలే అతడిని విడిచిపెట్టి వెళ్లిపోయారు.

‘‘వంశాన్ని వృద్ధి చేసేందుకు పెద్దల మాట విని 12 మందిని పెళ్లాడి 102 మంది పిల్లలకు తండ్రి అయ్యాను. 17 ఏళ్ల వయసులో మొదటి భార్యను 1972లో పెళ్లి చేసుకున్నాను.  పెళ్లైన సంవత్సరానికి మొదటి బిడ్డ సాండ్రా నాబ్వైర్‌ జన్మించింది’’ అని హసహ్య చెప్పారు. అతడి చిన్న భార్య వయసు 35 ఏళ్లు. ఆయన పిల్లల్లో పదేళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వారు ఉండటం గమనార్హం. హసహ్యకు తన పిల్లల్లో చాలా మంది పేర్లు గుర్తులేవట. పిల్లలను గుర్తించడంలో వారి తల్లుల సహాయం తీసుకుంటానని చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు