Rishi Sunak: రిషి సునాక్‌ 100 రోజుల ప్రతిన..

‘మిగతా వారు మార్పు గురించి మాటలతో సరిపెడతారు.. కానీ మేము దాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తాం’’ అంటూ బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ పేర్కొన్నారు.

Updated : 03 Feb 2023 06:58 IST

అభివృద్ధి దిశగా మార్పు తీసుకొస్తా
దేశ ప్రజలకు బ్రిటన్‌ ప్రధాని ఐదు హామీలు

లండన్‌: ‘మిగతా వారు మార్పు గురించి మాటలతో సరిపెడతారు.. కానీ మేము దాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తాం’’ అంటూ బ్రిటన్‌ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ పేర్కొన్నారు. ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా గురువారం సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను విడుదల చేశారు. దేశంలో ద్రవ్యోల్బణం తదితర అనేక సవాళ్లు ఉన్నప్పటికీ అభివృద్ధి దిశగా మార్పు సాధించడానికి ప్రతినబూనినట్లు వివరించారు. రాజకీయ గందరగోళ పరిస్థితుల మధ్య బోరిస్‌ జాన్సన్‌, లిజ్‌ ట్రస్‌లు ప్రధాన మంత్రి పదవులను వదులుకోగా భారతీయ మూలాలున్న రిషి సునాక్‌ గతేడాది అక్టోబరు 25న పాలనా పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. 42 ఏళ్లకే పీఎం బాధ్యతలు చేపట్టిన మొదటి శ్వేత జాతీయేతర నేత రిషి రాబోయే ఏడాదికి సంబంధించి ప్రధానమైన అయిదు లక్ష్యాలను వీడియోలో వివరించారు. ద్రవ్యోల్బణ కట్టడి, ఆర్థికరంగం వృద్ధి, రుణ భారం తగ్గింపు, జాతీయ ఆరోగ్య సేవల నిరీక్షణ జాబితాను తగ్గించడం, అక్రమ వలసల నిరోధం అంశాలు అందులో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు