భీకర అణు శక్తితో ఎదుర్కొంటాం.. అమెరికాకు ఉ.కొరియా హెచ్చరిక

తమ దగ్గర ఉన్న భీకరమైన అణ్వాయుధాల శక్తితో అమెరికాను ఎదుర్కొంటామని ఉత్తర కొరియా హెచ్చరించింది.

Updated : 03 Feb 2023 06:04 IST

సియోల్‌: తమ దగ్గర ఉన్న భీకరమైన అణ్వాయుధాల శక్తితో అమెరికాను ఎదుర్కొంటామని ఉత్తర కొరియా హెచ్చరించింది. ఉ.కొరియా సరిహద్దుల్లో దక్షిణ కొరియాతో కలిసి అమెరికా చేస్తున్న సైనిక విన్యాసాలు హద్దు మీరాయని ఘాటుగా వ్యాఖ్యానించింది. మంగళవారం సియోల్‌లో పర్యటించిన అమెరికా రక్షణశాఖ మంత్రి.. ద.కొరియా భద్రతకు యుద్ధవిమానాలు, విమాన నౌకలు సహా అత్యాధునిక ఆయుధాలు అందిస్తామని ప్రకటించారు. దీనికి ప్రతిస్పందనగానే ఉ.కొరియా అణు హెచ్చరికలు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు