China: అమెరికా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టాలనుకుంటోంది

అమెరికా ఒకే దెబ్బతో రెండు పిట్టల్ని కొట్టాలనుకుంటోందని చైనా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఓ వ్యాసంలో పేర్కొంది.

Updated : 03 Feb 2023 09:17 IST

భారత్‌ - యూఎస్‌ సంబంధాలపై చైనా

బీజింగ్‌: అమెరికా ఒకే దెబ్బతో రెండు పిట్టల్ని కొట్టాలనుకుంటోందని చైనా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఓ వ్యాసంలో పేర్కొంది. భారత్‌ను తన మిత్ర దేశంగా చేసుకోవడం ద్వారా స్వప్రయోజనాలను సాధించడంతో పాటు ఆ దేశాన్ని పావుగా వాడుకుని చైనా వృద్ధిని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని ఆక్షేపించింది. భారత్‌-అమెరికాల మధ్య అత్యంత కీలకమైన ఒప్పందం ఐసీఈటీ (ఇనీషియేటీవ్‌ ఆన్‌ క్రిటికల్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీ)పై అక్కసు వెళ్లగక్కుతూ ఈ కథనం సాగింది. భారత్‌ అమెరికాకు వంతపాడే అవకాశాలు తక్కువగా ఉండటంతో ఈ పథకం పారదని వ్యాసంలో ప్రస్తావించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని