కంటి చుక్కలతో బ్యాక్టీరియా వ్యాప్తి

భారత దేశానికి చెందిన గ్లోబల్‌ ఫార్మా హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తయారు చేసిన ఎజ్రీకేర్‌ కంటి చుక్కల పట్ల జాగ్రత్తగా ఉండాలని.. దీని వల్ల 12 రాష్ట్రాల్లో 55మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారని దేశ ప్రజలను అమెరికా హెచ్చరించింది.

Published : 03 Feb 2023 04:45 IST

భారత్‌కు చెందిన ఎజ్రీకేర్‌ను వాడొద్దంటూ అమెరికా హెచ్చరికలు

న్యూయార్క్‌: భారత దేశానికి చెందిన గ్లోబల్‌ ఫార్మా హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తయారు చేసిన ఎజ్రీకేర్‌ కంటి చుక్కల పట్ల జాగ్రత్తగా ఉండాలని.. దీని వల్ల 12 రాష్ట్రాల్లో 55మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారని దేశ ప్రజలను అమెరికా హెచ్చరించింది. దీనికి సంబంధించి బుధవారం రాత్రి వైద్యులను ది సెంటర్‌ ఫర్‌ డిజీస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) అప్రమత్తం చేసింది. ‘‘న్యూయార్క్‌, వాషింగ్టన్‌తో పాటు మరో 10రాష్ట్రాల్లో పలువురు కంటి చుక్కలు వేసుకున్న తర్వాత బ్యాక్టీరియా వ్యాప్తి చెంది ఊపిరితిత్తులు, రక్తం, మూత్రంలో ఇన్ఫెక్షన్‌ కనిపించింది. దీనిపై వినియోగదారులను సైతం అప్రమత్తం చేస్తున్నాం’’ అని తెలిపింది. రెండు వారాల క్రితం కూడా సీడీసీ ఇదే హెచ్చరికలు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు