చిలీలో కార్చిచ్చు బీభత్సం

వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తున్న అధిక ఉష్ణోగ్రతలు లాటిన్‌ అమెరికా దేశం చిలీని నిప్పుల కుంపటిలా మార్చివేశాయి. వేసవిలో వీస్తున్న తీవ్ర వడగాల్పులతో కార్చిచ్చు రగులుకుంటోంది.

Published : 05 Feb 2023 04:12 IST

వేల ఎకరాల్లో అడవులు ఆహుతి
ఇప్పటి వరకు 13 మంది మృతి

శాంటియాగో: వాతావరణ మార్పుల వల్ల సంభవిస్తున్న అధిక ఉష్ణోగ్రతలు లాటిన్‌ అమెరికా దేశం చిలీని నిప్పుల కుంపటిలా మార్చివేశాయి. వేసవిలో వీస్తున్న తీవ్ర వడగాల్పులతో కార్చిచ్చు రగులుకుంటోంది. ఇప్పటి వరకు 150కి పైగా ప్రాంతాల్లో అడవులు దగ్ధమవుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అగ్ని కీలల ధాటికి సుమారు 35వేల ఎకరాల విస్తీర్ణంలోని అడవులు బూడిదయ్యాయి. శరవేగంగా విస్తరిస్తున్న మంటల్లో చిక్కి, వాటి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో, కార్చిచ్చును ఆర్పివేసే పనుల్లో నిమగ్నవుతూ... శుక్రవారం సాయంత్రం వరకు 13 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. వీరిలో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో మృతి చెందిన అగ్ని మాపక సిబ్బంది ఒకరు ఉన్నారు. అత్యవసర సేవల బృందానికి చెందిన హెలికాఫ్టర్‌ కూలిపోవడంతో మరో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. వాహనంలో వెళ్తున్న నలుగురు కుటుంబ సభ్యులు ఆహుతయ్యారని వివరించారు. చిలీ రాజధాని శాంటియాగోకు 560 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయోబయో, నుబుల్‌ ప్రాంతంలో కార్చిచ్చు వ్యాపించిందని వెల్లడించారు. వందల ఇళ్లు కాలిపోయాయని హోంమంత్రి కరోలినా తోహా వెల్లడించారు. చిలీ ప్రభుత్వం అత్యయిక స్థితిని ప్రకటించింది. గతంలో కంటే రెండు రెట్లు అధికంగా అటవీ ప్రాంతం దగ్ధమైనట్లు ప్రభుత్వం పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు