బందీలైన సైనికులను మార్చుకున్న రష్యా, ఉక్రెయిన్‌

యుద్ధంలో బందీలుగా చేసుకున్న సైనికులను పరస్పరం విడిపించుకున్నట్లు ఉక్రెయిన్‌, రష్యాలు శనివారం ప్రకటించాయి.

Updated : 05 Feb 2023 05:32 IST

కీవ్‌: యుద్ధంలో బందీలుగా చేసుకున్న సైనికులను పరస్పరం విడిపించుకున్నట్లు ఉక్రెయిన్‌, రష్యాలు శనివారం ప్రకటించాయి. తమ సైన్యానికి చెందిన 116 మందిని రష్యా అప్పగించిందని ఉక్రెయిన్‌ పేర్కొంది. ఉక్రెయిన్‌లో బందీలుగా ఉన్న కొంత మంది ‘ప్రత్యేక  సిబ్బంది’ సహా 63 మంది సైనికులు విడుదలయ్యారని రష్యా తెలిపింది. అయితే ఆ ప్రత్యేక సిబ్బంది అంటే ఎవరో తెలపలేదు. వారి విడుదలకు యూఏఈ మధ్యవర్తిత్వం వహించిందని తన ప్రకటనలో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని