US Visa: విదేశాల్లో ఉన్న భారతీయులకు అక్కడే అమెరికా వీసా

పర్యాటకం, వ్యాపారాల నిమిత్తం వివిధ దేశాలను సందర్శిస్తూ బీ1, బీ2 వీసాలపై అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు దిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం తీపి కబురు అందించింది.

Updated : 06 Feb 2023 09:19 IST

పర్యాటకులకు, వ్యాపారస్థులకు తీపి కబురు

దిల్లీ: పర్యాటకం, వ్యాపారాల నిమిత్తం వివిధ దేశాలను సందర్శిస్తూ బీ1, బీ2 వీసాలపై అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు దిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం తీపి కబురు అందించింది. విదేశాల్లో ఉన్న భారతీయులు వారు పర్యటనలో ఉన్న దేశంలోని అమెరికా కాన్సులేట్‌ లేదా రాయబార కార్యాలయాల్లోనే వీసా అపాయింట్‌మెంట్‌ను పొందొచ్చని, దాని కోసం భారత్‌లోని కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని తెలిపింది. ఉదాహరణకు థాయ్‌లాండ్‌లో నివసిస్తున్న భారతీయులు బీ1, బీ2 వీసాపై అమెరికాకు వెళ్లాలనుకుంటే.. అక్కడి అమెరికా కాన్సులేట్‌ లేదా రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తే సరిపోతుంది. మరి కొన్ని నెలల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. వీసా జారీలో తలెత్తుతున్న తీవ్ర జాప్యాన్ని నివారించడానికి తీసుకుంటున్న వరుస చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం వెలువడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని