కశ్మీర్‌ ప్రజలకు అన్ని రకాలుగా పూర్తి సహకారం

ఐరాస నిబంధనల ప్రకారం తమ అభీష్టం మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం పొందే వరకు కశ్మీర్‌ ప్రజలకు దౌత్యపరంగా, రాజకీయంగా తమ సహకారం ఉంటుందని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మరోసారి స్పష్టం చేశారు.

Published : 06 Feb 2023 04:35 IST

మరోసారి ప్రకటించిన పాక్‌ ప్రధాని

ఇస్లామాబాద్‌: ఐరాస నిబంధనల ప్రకారం తమ అభీష్టం మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం పొందే వరకు కశ్మీర్‌ ప్రజలకు దౌత్యపరంగా, రాజకీయంగా తమ సహకారం ఉంటుందని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మరోసారి స్పష్టం చేశారు. ముజఫరాబాద్‌లో ఉన్న పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ అసెంబ్లీలో ఆదివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఫిబ్రవరి 5ను కశ్మీర్‌ సౌభ్రాతృత్వ దినంగా నిర్వహిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా షరీఫ్‌ ప్రసంగించారు.  కశ్మీర్‌ ‘అమరులకు’ నివాళులు అర్పించినట్లు పాక్‌ సైన్యం ప్రకటించింది. ఇక్కడి ప్రధాన నగరాల్లో కశ్మీర్‌కు మద్దతుగా రోడ్లపై పలు ప్రదర్శనలు జరిగాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు