చిలీలో ఆగని కార్చిచ్చు.. 23 మంది బలి

అధిక ఉష్ణోగ్రతలతో చిలీలో కార్చిచ్చు ఆగట్లేదు. వీటి వల్ల ఇప్పటి వరకు 23మంది మరణించారు. దాదాపు 979 మందికి గాయాలయ్యాయి.

Published : 06 Feb 2023 04:35 IST

రంగంలోకి అర్జెంటీనా, బ్రెజిల్‌ విమానాలు

శాంటియాగో: అధిక ఉష్ణోగ్రతలతో చిలీలో కార్చిచ్చు ఆగట్లేదు. వీటి వల్ల ఇప్పటి వరకు 23మంది మరణించారు. దాదాపు 979 మందికి గాయాలయ్యాయి. ఇందులో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరో 1,428 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. దేశవ్యాప్తంగా 190కి పైగా ప్రాంతాల్లో కార్చిచ్చులు చెలరేగాయని అధికారులు తెలిపారు. వందలాది ఇళ్లను మంటలు దహించివేశాయి. భారీ గాలులకు మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. మంటలు ఆర్పేందుకు వచ్చిన హెలికాప్టర్‌ కూలి పైలెట్‌ మృతి చెందినట్లు పేర్కొంది. మొత్తం 14వేల హెక్టార్లకుపైగా అటవీ ప్రాంతం దహించుకుపోయిందని అధికారులు చెప్పారు. చిలీలో గత కొన్నిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో అత్యవసర పరిస్థితిని విధించి సైన్యాన్ని రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. కార్చిచ్చును అదుపు చేయడానికి అర్జెంటీనా, బ్రెజిల్‌ దేశాల నుంచి విమానాలు రానున్నాయని అధికారులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు