ముషారఫ్‌ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి

పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌(79) అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దుబాయ్‌లో మరణించిన ఆయన భౌతికకాయాన్ని ఛార్టెర్డ్‌ విమానంలో సోమవారం రాత్రి కరాచీ విమానాశ్రయానికి తీసుకొచ్చారు.

Updated : 07 Feb 2023 05:40 IST

దుబాయ్‌ నుంచి కరాచీకి భౌతికకాయం

కరాచీ: పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌(79) అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దుబాయ్‌లో మరణించిన ఆయన భౌతికకాయాన్ని ఛార్టెర్డ్‌ విమానంలో సోమవారం రాత్రి కరాచీ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. వాస్తవానికి ఈ విమానం మధ్యాహ్నానికే చేరుకోవలసి ఉండగా ఆలస్యం జరిగింది. కరాచీలోని ఆర్మీ కంటోన్మెంట్‌ ప్రాంతంలో గల పాత శ్మశానవాటికలో భౌతికకాయానికి మంగళవారం అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. ఎయిర్‌బస్‌ 319 ఛార్టెర్డ్‌ విమానంలో ముషారఫ్‌ భౌతికకాయాన్ని ఆయన భార్య సాబా, కుమారుడు బిలాల్‌, కుమార్తె వెంటరాగా కరాచీ తీసుకువచ్చినట్లు పాక్‌ అధికార వర్గాలు తెలిపాయి. భారత్‌- పాక్‌ మధ్య 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధానికి కారకుడైన ముషారఫ్‌ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం దుబాయ్‌లో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన 1943లో దిల్లీలో జన్మించారు. దేశ విభజన సమయంలో 1947లో పాకిస్థాన్‌కు వలస వెళ్లారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు