Diabetes: ‘డి’ విటమిన్‌తో మధుమేహం నుంచి రక్షణ!

 డి విటమిన్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహం నుంచి రక్షించుకునే అవకాశం ఉందని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Updated : 08 Feb 2023 10:01 IST

బోస్టన్‌: డి విటమిన్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహం నుంచి రక్షించుకునే అవకాశం ఉందని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ వ్యాధికి ముందు దశలో ఉన్న వారు టైప్‌-2 డయాబెటిస్‌ బారినపడే ముప్పును ఇది తగ్గిస్తుందని వివరించారు.

సూర్యుడిలోని అతినీలలోహిత కిరణాలు చర్మాన్ని తాకినప్పుడు శరీరం డి విటమిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొన్ని రకాల ఆహారాలు, సప్లిమెంట్లలో ఇది ఉంటుంది. ఇది కొవ్వులో కరిగిపోతుంది. శరీరంలో భిన్న విధులు నిర్వర్తిస్తుంది. ఇన్సులిన్‌ ఉత్పత్తి, గ్లూకోజ్‌ జీవక్రియలో దీనికి పాత్ర ఉంది. టఫ్ట్స్‌ మెడికల్‌ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు.. మూడు క్లినికల్‌ ప్రయోగాల డేటాను విశ్లేషించారు. మధుమేహం ముప్పుపై డి విటమిన్‌ సప్లిమెంట్ల ప్రభావాన్ని మదించారు. మూడేళ్ల తర్వాత పరీక్షార్థుల్లో ఎంత మంది ఆ వ్యాధి బారినపడ్డారన్నది పరిశీలించారు. డి విటమిన్‌ సప్లిమెంట్లు తీసుకుంటే మధుమేహం ముప్పు 15 శాతం మేర తగ్గుతుందని ఇందులో తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని