ఇస్లామిక్ తీవ్రవాదానికి కొత్త కేంద్రంగా సహారా దేశాలు
ఇస్లామిక్ తీవ్రవాదానికి కొత్త కేంద్రంగా సహారా ఎడారి చుట్టుపక్కల ఉన్న దేశాలు (సబ్ సహారన్ ఆఫ్రికా) మారుతున్నట్లు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎన్‌డీపీ) నివేదిక వెల్లడించింది.
యూఎన్‌డీపీ నివేదిక వెల్లడి
నైరోబి (కెన్యా): ఇస్లామిక్ తీవ్రవాదానికి కొత్త కేంద్రంగా సహారా ఎడారి చుట్టుపక్కల ఉన్న దేశాలు (సబ్ సహారన్ ఆఫ్రికా) మారుతున్నట్లు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎన్‌డీపీ) నివేదిక వెల్లడించింది. ఇక్కడున్న ఆర్థిక సమస్యలు దీనికి ప్రధాన కారణమవుతున్నాయని పేర్కొంది. 2017తో పోలిస్తే 92శాతం మంది కొత్తగా తీవ్రవాద బృందాల్లో చేరారని వివరించింది. చాలామంది ఆఫ్రికన్ల జీవన శైలిపై కొవిడ్-19 ప్రభావం చూపిందని, అక్కడ అధిక ద్రవ్యోల్బణం ఏర్పడిందని వివరించింది. అదే సమయంలో మత ప్రాతిపదికన తీవ్రవాదం వైపు మళ్లేవారు 57శాతం తగ్గారని తెలిపింది. బుర్కినాఫాసో, కామెరూన్, చాద్, మాలి, నైగర్, నైజీరియా, సోమాలియా, సూడాన్ దేశాల్లో 2,200 మంది తీవ్రవాదుల అభిప్రాయాలను సేకరించామని పేర్కొంది. తీవ్రవాద గ్రూపుల్లో అంతకుముందే సభ్యులుగా ఉన్న వేయి మంది కూడా ఇందులో ఉన్నారని తెలిపింది. 2017 నుంచి కనీసం 4,155 దాడులు నమోదయ్యాయని యూఎన్‌డీపీ నివేదిక వెల్లడించింది. ఈ దాడుల్లో 18,417 మంది మరణించారని, సోమాలియాలో ఎక్కువ దారుణాలు నమోదయ్యాయని పేర్కొంది. సోమాలియాలోని అల్‌షబాబ్, నైజీరియాలోని బోకోహరామ్ తదితర ఉగ్రవాద బృందాలను ఈ నివేదిక ప్రస్తావించింది. కొందరు ఉగ్రవాదులు అల్‌ఖైదాకు విధేయత చూపుతున్నారని వెల్లడించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Ts-top-news News
8.30 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి..
-
Crime News
పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. యువకుణ్ని హతమార్చిన యువతి
-
Politics News
అఖండ హిందూ రాజ్యమే లక్ష్యం.. శోభాయాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్