క్యాన్సర్‌ రోగులకు దీర్ఘకాల కొవిడ్‌

క్యాన్సర్‌ రోగుల్లో సగం మందికిపైగా కొవిడ్‌ సోకిన తర్వాత ఆరు నెలల వరకు దీర్ఘకాల కొవిడ్‌తో బాధపడుతున్నట్లు అమెరికాలో జరిగిన ఒక అధ్యయనం తేల్చింది. క్యాన్సర్‌ చికిత్స పొందుతున్న పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా దీనికి గురవుతున్నారు.

Published : 09 Feb 2023 04:32 IST

వాషింగ్టన్‌: క్యాన్సర్‌ రోగుల్లో సగం మందికిపైగా కొవిడ్‌ సోకిన తర్వాత ఆరు నెలల వరకు దీర్ఘకాల కొవిడ్‌తో బాధపడుతున్నట్లు అమెరికాలో జరిగిన ఒక అధ్యయనం తేల్చింది. క్యాన్సర్‌ చికిత్స పొందుతున్న పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా దీనికి గురవుతున్నారు. క్యాన్సర్‌ రోగుల్లో 10 నుంచి 87 శాతం మందిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరిలోనూ తీవ్ర కొవిడ్‌తో ఆస్పత్రి పాలైనవారిలో మాత్రమే 30 రోజులకుపైగా దీర్ఘకాల కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. టెక్సాస్‌ విశ్వవిద్యాలయ పరిశోధక బృందం ఎంచుకున్న 312 మంది క్యాన్సర్‌ రోగుల్లో 188 మంది దీని బారిన పడ్డారు. తీవ్ర అలసట, నిద్రలేమి, కండరాల నొప్పులు, జీర్ణకోశ రుగ్మతలు వంటివి దీర్ఘకాల కొవిడ్‌ లక్షణాలు. అధిక రక్తపోటుకు గురయ్యేవారిలో మాత్రం ఈ లక్షణాలు కనిపించకపోవడం ఆశ్చర్యకరం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని