Video games: వీడియో గేమ్స్‌తో పిల్లల విజ్ఞాన సముపార్జన దెబ్బతినదు

మీ పిల్లలు విపరీతంగా వీడియో గేమ్స్‌ ఆడుతున్నారా. మరేం పర్వాలేదు. వీడియో గేమ్స్‌ ఆడటం వల్ల బాలల గ్రహణ శక్తి తగ్గడం, విజ్ఞాన సముపార్జన దెబ్బతినడం లేదా మెరుగుపడటం లాంటివి జరగవని అమెరికాలోని హ్యూస్టన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చారు.

Updated : 09 Feb 2023 07:46 IST

హ్యూస్టన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుల తాజా అధ్యయనం వెల్లడి

వాషింగ్టన్‌: మీ పిల్లలు విపరీతంగా వీడియో గేమ్స్‌ ఆడుతున్నారా. మరేం పర్వాలేదు. వీడియో గేమ్స్‌ ఆడటం వల్ల బాలల గ్రహణ శక్తి తగ్గడం, విజ్ఞాన సముపార్జన దెబ్బతినడం లేదా మెరుగుపడటం లాంటివి జరగవని అమెరికాలోని హ్యూస్టన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చారు. కొందరిలో ఈ గేమ్స్‌ గ్రహణ శక్తిని మెరుగుపరిచినా.. యవ్వన వయసు వారిపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపించలేదని తెలిపారు. వివిధ పాఠశాలల్లో చదువుతున్న 160మంది యవ్వన వయసు వారికి భాషా, గణిత సామర్థ్యాలు అంచనా వేసే కాగ్‌ ఏటీ పరీక్ష జరిపారు. ఈ బాలలు రోజుకు సగటున రెండున్నర గంటలసేపు వీడియో గేమ్స్‌ ఆడతామని చెప్పారు. కొంతమంది నాలుగున్నర గంటలు అని చెప్పారు. అయినా వారి గ్రహణ శక్తి, సామర్థ్యాలు మెరుగ్గా ఉన్నాయి. అదే పనిగా వీడియో గేమ్స్‌ ఆడటం వల్ల పిల్లల్లో అటు గ్రహణ శక్తి మెరుగుపడటం గానీ, సామర్థ్యాలు తగ్గడం గానీ ఉండదని అధ్యయనం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని