నేనున్నానని.. నీకేం కాదని!

భూకంపం ధాటికి భవనం కూలడంతో ఆ శిథిలాల్లో చిక్కుకుపోయారో అక్కాతమ్ముడు. అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ తన బుజ్జి తమ్ముడికి ఏం కాకుండా చూసిందా ఏడేళ్ల బాలిక.

Published : 09 Feb 2023 07:23 IST

శిథిలాల కింద తమ్ముడి తలపై చెయ్యి అడ్డుపెట్టి కాపాడిన అక్క

ఐక్యరాజ్యసమితి: భూకంపం ధాటికి భవనం కూలడంతో ఆ శిథిలాల్లో చిక్కుకుపోయారో అక్కాతమ్ముడు. అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ తన బుజ్జి తమ్ముడికి ఏం కాకుండా చూసిందా ఏడేళ్ల బాలిక. ఓవైపు తాను బండరాయి కింద నలిగిపోతున్నా తమ్ముడికి దెబ్బలు తగలకుండా అతడి తలపై చెయ్యి అడ్డుపెట్టింది. ప్రకృతి విపత్తుతో అతలాకుతలమైన సిరియాలో కన్పించిన ఈ దృశ్యం హృదయాల లోతుల్ని ఆర్ద్రతతో తడిమింది. సహాయక సిబ్బంది సుమారు 17 గంటలు శ్రమించి వారిద్దరిని సురక్షితంగా బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఐక్యరాజ్యసమితి ప్రతినిధి మహమ్మద్‌ సఫా తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని