Cancer: ప్రాసెస్డ్‌ ఆహారంతో క్యాన్సర్‌ ముప్పు

తీవ్రస్థాయిలో ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ బారినపడే, ఆ వ్యాధితో మరణించే ముప్పు పెరుగుతుందని బ్రిటన్‌ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.

Updated : 10 Feb 2023 07:33 IST

లండన్‌: తీవ్రస్థాయిలో ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ బారినపడే, ఆ వ్యాధితో మరణించే ముప్పు పెరుగుతుందని బ్రిటన్‌ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఈ తరహా ఆహార పదార్థాలను ఉత్పత్తి సమయంలో భారీగా ప్రాసెస్‌ చేస్తారు. శీతల పానీయాలు, పలు రకాల ప్యాకేజ్డ్‌ ఆహార పదార్థాలు ఈ కోవలోకి వస్తాయి. వీటిలో ఉప్పు, కొవ్వు, చక్కెర, రసాయనాలు ఎక్కువే. వీటివల్ల ఊబకాయం, టైప్‌-2 మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని ఇప్పటికే వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఇంపీరియల్‌ కాలేజీ పరిశోధకులు నడి వయసులో ఉన్న 2లక్షల మందికి సంబంధించిన డేటాను విశ్లేషించారు. పదేళ్లపాటు ఈ పరిశీలన సాగింది. తీవ్రస్థాయిలో ప్రాసెస్‌ చేసిన ఆహారాన్ని తీసుకున్నవారికి క్యాన్సర్‌ ముప్పు ఎక్కువని ఇందులో వెల్లడైంది. ముఖ్యంగా అండాశయ, రొమ్ము క్యాన్సర్ల బారినపడే అవకాశం ఎక్కువని తేలింది. ఈ తరహా తినుబండారాలను భుజించడం 10 శాతం పెరిగితే.. క్యాన్సర్‌ ముప్పు 2 శాతం పెరగొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వ్యాధితో మరణించే ముప్పు కూడా 6 శాతం పెరుగుతుందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని