Diabetes: సెనగపిండితో మధుమేహం దూరం

సెనగలు, కాయధాన్యాలు, బీన్స్‌ వంటివి ఆహారంలో భాగమైతే గుండెజబ్బుల ముప్పు తక్కువనే విషయం తెలిసిందే. వీటిలో పెద్ద మొత్తంలో పీచుపదార్థాలు ఉండటమే దీనికి కారణం.

Published : 16 Feb 2023 07:57 IST

లండన్‌: సెనగలు, కాయధాన్యాలు, బీన్స్‌ వంటివి ఆహారంలో భాగమైతే గుండెజబ్బుల ముప్పు తక్కువనే విషయం తెలిసిందే. వీటిలో పెద్ద మొత్తంలో పీచుపదార్థాలు ఉండటమే దీనికి కారణం. తాజా పరిశోధనల మేరకు గోధుమ పిండి స్థానంలో సెనగ పిండిని ఆహారంలో భాగంగా చేసుకుంటే కడుపునిండిన భావన కలిగిస్తుందని,  అలాగే ఇన్సులిన్‌, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుందని తేలింది. తద్వారా అధిక బరువు సమస్యతో పాటు, టైప్‌-2 మధుమేహం బారిన పడకుండా తప్పించుకోవచ్చని వెల్లడైంది. 30% కొమ్ముసెనగ పిండి కలిపిన గోధుమ పిండితో తయారు చేసిన బ్రెడ్‌ భుజిస్తే.. సాధారణ రొట్టె తిన్నప్పటితో పోలిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు 40% తగ్గినట్లు గుర్తించారు. దీనికి ఇందులో ఉండే పిండిపదార్థం అరుగుదల స్థాయిని నెమ్మదింపచేయడమే కారణమని పరిశోధకులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు