పాకిస్థాన్‌కు అప్పు పుట్టింది

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ అప్పు కోసం ప్రపంచ దేశాలన్నింటివైపు ఆశగా ఎదురుచూస్తున్న పాకిస్థాన్‌కు ఎట్టకేలకు 70 కోట్ల డాలర్ల రుణం దొరికింది. 

Updated : 23 Feb 2023 06:09 IST

70 కోట్ల డాలర్లివ్వడానికి ముందుకొచ్చిన చైనా

ఇస్లామాబాద్‌: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ అప్పు కోసం ప్రపంచ దేశాలన్నింటివైపు ఆశగా ఎదురుచూస్తున్న పాకిస్థాన్‌కు ఎట్టకేలకు 70 కోట్ల డాలర్ల రుణం దొరికింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశానికిది భారీ సాయమే. చిత్రమేంటంటే సీపెక్‌ పేరుతో పాక్‌ను అప్పుల ఊబిలోకి నెట్టిన చైనాయే ఈ రుణం అందించడానికి ముందుకు రావడం. ‘‘చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంకు ద్వారా ఈ వారం 70 కోట్ల డాలర్లు మన స్టేట్‌ బ్యాంకు ఖాతాలో పడనున్నాయి’’ అని పాక్‌ ఆర్థికమంత్రి ఇషాక్‌ దర్‌ బుధవారం ట్వీట్‌ చేశారు. పాకిస్థాన్‌ విదేశీ మారకద్రవ్య నిధులు అడుగంటిపోతున్నాయి. ఇప్పుడు ఆ దేశం దగ్గర మూడు వారాల దిగుమతులకు సరిపడా డాలర్లు మాత్రమే ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌)సంస్థ ఇస్తానన్న 1.1 బిలియన్‌ డాలర్ల రుణంపై ఇంకా తుదినిర్ణయం వెలువడలేదు. ఐఎంఎఫ్‌ కరుణిస్తే.. మిగతా దేశాలు కూడా అప్పులివ్వడానికి ముందుకొస్తాయని పాకిస్థాన్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా రుణ ప్రకటన పాక్‌కు ఊరటే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని