China: పెళ్లి మండపం వద్ద మాజీ ప్రియురాళ్ల నిరసన
చైనాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు వివాహం చేసుకుంటుండగా అతడి మాజీ ప్రియురాళ్లు పెళ్లి మండపం వద్దకు చేరుకుని బ్యానర్ పట్టుకొని మరీ నిరసన చేపట్టారు.
చైనాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు వివాహం చేసుకుంటుండగా అతడి మాజీ ప్రియురాళ్లు పెళ్లి మండపం వద్దకు చేరుకుని బ్యానర్ పట్టుకొని మరీ నిరసన చేపట్టారు. యున్నన్ ప్రావిన్సుకు చెందిన చెన్ అనే యువకుడు పెళ్లికి సిద్ధం కాగా, కొందరు యువతులు అనూహ్యంగా అక్కడ నిరసనకు దిగడం కలకలం రేపింది. ‘‘మేం నీ మాజీ ప్రియురాళ్లం. ఈ రోజు మేమందరం కలిసి నీ జీవితాన్ని నాశనం చేస్తాం’’ అని రాసి ఉన్న బ్యానర్‌ను పట్టుకొని వారు అక్కడ నిరసన చేపట్టారు. దీంతో ఆందోళన చెందిన వధువు, ఆమె తల్లిదండ్రులు.. దీనిపై చెన్ను ప్రశ్నించారు. వాళ్లు చేసిన పనివల్ల తనకేమీ కోపం రాలేదని.. గతంలో ఓ చెడు బాయ్‌ఫ్రెండ్‌గా ఉన్న మాట వాస్తవమేనని చెన్ తెలిపాడు. అప్పట్లో తనది చిన్న వయసని.. పరిపక్వత లేనందున చాలామంది అమ్మాయిలను బాధ పెట్టానని చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్