Imran Khan: సర్కార్‌ మార్పు కుట్రకు పాక్‌ భారీ మూల్యం: ఇమ్రాన్‌

పాకిస్థాన్‌లో ప్రభుత్వ మార్పునకు జరిగిన కుట్ర కారణంగా దేశ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారని మాజీ ప్రధాని, తెహ్రీక్‌-ఏ-ఇన్సాఫ్‌ పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ తెలిపారు.

Published : 03 Mar 2023 07:21 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ప్రభుత్వ మార్పునకు జరిగిన కుట్ర కారణంగా దేశ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారని మాజీ ప్రధాని, తెహ్రీక్‌-ఏ-ఇన్సాఫ్‌ పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ తెలిపారు. డాలరుతో పోలిస్తే పాక్‌ రూపాయి మారకం విలువ గురువారం ఒక్కరోజే 18.74 రూపాయలు పడిపోయింది. మరోవైపు.. రుణసాయం కోసం ఐఎంఎఫ్‌తో చర్చల్లో నెలకొన్న ప్రతిష్ఠంభన ఇప్పటికీ కొనసాగుతోంది. ఫలితంగా నగదు కొరతతో పాకిస్థాన్‌ అల్లాడుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ట్విటర్‌ వేదికగా ఇమ్రాన్‌.. పాలకులపై విరుచుకుపడ్డారు. ‘విలువను తగ్గించడం ద్వారా ప్రభుత్వం పాక్‌ రుపీని చంపేసింది. గత 11 నెలల్లో రుపీ విలువ 62% తగ్గింది. ఈ కారణంగా దేశం అప్పు రూ.14.3 ట్రిలియన్లకు పెరిగింది. ద్రవ్యోల్బణం గత 75 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 31.5 శాతానికి చేరింది. అధికారంలోకి రావడానికి కొందరు నేరగాళ్ల ముఠాకు పాక్‌ ఆర్మీ మాజీ చీఫ్‌ ఖమర్‌ జావెద్‌ బజ్వా సహకరించిన కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి’ అని మరోసారి మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని