Diabetes: టైప్‌-1 మధుమేహానికి కళ్లెం వేసే వినూత్న విధానం

టైప్‌-1 మధుమేహ బాధితులకు వరంగా మారగల సరికొత్త విధానాన్ని అమెరికాలోని మసాచుసెట్స్‌ జనరల్‌ ఆసుపత్రి (ఎంజీహెచ్‌) పరిశోధకుల నేతృత్వంలోని బృందం తాజాగా అభివృద్ధి చేసింది.

Published : 06 Mar 2023 08:35 IST

వాషింగ్టన్‌: టైప్‌-1 మధుమేహ బాధితులకు వరంగా మారగల సరికొత్త విధానాన్ని అమెరికాలోని మసాచుసెట్స్‌ జనరల్‌ ఆసుపత్రి (ఎంజీహెచ్‌) పరిశోధకుల నేతృత్వంలోని బృందం తాజాగా అభివృద్ధి చేసింది. ఈ రకం మధుమేహుల్లో- ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే బీటా కణాలపై సొంత రోగనిరోధక వ్యవస్థ దాడి చేస్తుంటుంది. బీటా కణాల మార్పిడి ద్వారా వారికి సాంత్వన చేకూర్చవచ్చని పరిశోధకులు తేల్చారు. అయితే అందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానాలు ప్రభావవంతంగా పనిచేయడం లేదు. కాలేయానికి జోడించిన బీటా కణాల్లో దాదాపు సగం.. రోగనిరోధక వ్యవస్థ దాడితో ధ్వంసమవుతున్నాయి. ఇందుకు పరిష్కార మార్గంగా- పేగులను చుట్టి ఉండే ఒమెంటమ్‌తో బీటా కణాలను అనుసంధానించే విధానాన్ని కనుగొన్నారు. ఇందులో బీటా కణాలు కృత్రిమ క్లోమం తరహాలో పనిచేస్తాయని పరిశోధకులు తెలిపారు. వాటిపై రోగ నిరోధక వ్యవస్థ ప్రతికూల ప్రభావం చూపబోదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని