అమెరికాలో జిల్లా జడ్జిగా.. భారతీయ- అమెరికన్‌ మహిళ

అమెరికాలోని మసాచుసెట్స్‌లో తొలి భారతీయ- అమెరికన్‌ మహిళా జడ్జిగా తెజల్‌ మెహతా నియమితులయ్యారు.

Published : 07 Mar 2023 04:35 IST

వాషింగ్టన్‌: అమెరికాలోని మసాచుసెట్స్‌లో తొలి భారతీయ- అమెరికన్‌ మహిళా జడ్జిగా తెజల్‌ మెహతా నియమితులయ్యారు. అయెర్‌ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా  ఆమె ప్రమాణస్వీకారం చేశారు. గత కొంతకాలం ఇదే న్యాయస్థానంలో సహ న్యాయమూర్తిగా ఆమె విధులు నిర్వర్తించారు. ‘‘న్యాయవాదిగా.. మీరు ప్రజలకు సహాయం చేయవచ్చు. కానీ అది ఒక పరిధి వరకే. న్యాయమూర్తిగా సమస్యల మూలాన్ని గుర్తించవచ్చు’’ అని ఆమె అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని