Honey Trap: పదమూడేళ్ల బాలుడిపై.. 31 ఏళ్ల మహిళ వలపు వల

ఇంట్లో పని ఉందని, సాయం చేయాలంటూ పొరుగింటి బాలుడి (13)కి వల విసిరింది ఓ మహిళ. అతడిపై ఉన్న వ్యామోహంతో పదే పదే ఇంటికి పిలిచి శారీరక సంబంధం ఏర్పర్చుకుంది.

Updated : 09 Mar 2023 07:52 IST

ఇంట్లో పని ఉందని, సాయం చేయాలంటూ పొరుగింటి బాలుడి (13)కి వల విసిరింది ఓ మహిళ. అతడిపై ఉన్న వ్యామోహంతో పదే పదే ఇంటికి పిలిచి శారీరక సంబంధం ఏర్పర్చుకుంది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బాలుడిని ఆమె కోరింది. ఇద్దరికీ వయసులో చాలా తేడా ఉండటంతో ఎవరికీ అనుమానం రాలేదు. చివరకు ఆమె గర్భం దాల్చడంతో గుట్టు రట్టయింది. అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో వెలుగుచూసిన ఈ ఘటనతో పోలీసులు రంగంలోకి దిగి ఆండ్రియా సెరానో (31)ను అరెస్ట్‌ చేశారు. మైనర్‌పై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు మోపారు.

తమ మధ్య లైంగిక సంబంధం ఉన్న మాట వాస్తవమేనని కోర్టులో ఆండ్రియా అంగీకరించింది. కడుపులో పెరుగుతున్న బిడ్డకు.. ఆ బాలుడే తండ్రి అని చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తోచక జడ్జీలు తలలు పట్టుకున్నారు. మహిళ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆమెను విడుదల చేయడానికే మొగ్గు చూపారు. 70 వేల డాలర్ల (రూ.57 లక్షలు) పూచీకత్తుతో విడుదలకు న్యాయమూర్తి ఆదేశించారు. ఇరు పక్షాల మధ్య రాజీ కుదిరిన నేపథ్యంలో కేసును ముగించేందుకే కోర్టు ప్రయత్నించింది. అయితే, పుట్టబోయే బిడ్డకు ఆ బాలుణ్నే తండ్రిగా పరిగణించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని