Elon Musk: మాజీ ఉద్యోగి అంగవైకల్యాన్ని ఎగతాళి చేసిన మస్క్
ట్విటర్ నుంచి తొలగించిన మాజీ ఉద్యోగిని ఎగతాళి చేస్తూ అతడి వైకల్యం గురించి ట్వీట్లు చేసిన సంస్థ అధిపతి ఎలాన్ మస్క్... ఆనక తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరారు.
తప్పు సరిదిద్దుకొని క్షమాపణ
శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విటర్ నుంచి తొలగించిన మాజీ ఉద్యోగిని ఎగతాళి చేస్తూ అతడి వైకల్యం గురించి ట్వీట్లు చేసిన సంస్థ అధిపతి ఎలాన్ మస్క్...ఆనక తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరారు. తనకు సమాచారం ఇవ్వకుండా ఉద్యోగం నుంచి తొలగించినందుకు ఐస్‌లాండ్‌కు చెందిన హరాల్డుర్ థొర్లెఫ్‌సన్ (హల్లి) అనే ట్విటర్ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. 9 రోజులు ఎదురుచూసి చివరకు మస్క్‌ను ట్యాగ్ చేస్తూ సోమవారం ట్వీట్ చేశారు. దీనికి ‘మీరు ట్విటర్‌లో ఏం పని చేస్తున్నారు. ఏ విభాగంలో పని చేశారు’ అని మస్క్ వరుస ప్రశ్నలు సంధించగా.. హల్లి దానికి సమాధానాలిచ్చారు. మీరు ఏమంత గొప్పగా పని చేయలేదని మస్క్ స్పందించారు. ట్విటర్‌లో ఈ సంభాషణ జరుగుతుండగానే హల్లికి ట్విటర్ నుంచి తన లేఆఫ్ ఈ-మెయిల్ వచ్చింది. మస్క్ అక్కడితో ఆగకుండా హల్లికి ఉన్న వైకల్యం గురించి వ్యాఖ్యానిస్తూ.. అతడికి ఉన్న సమస్యను సాకుగా చూపిస్తున్నారని ట్వీట్ చేశారు. మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతున్న హల్లి నిలబడలేరు. చక్రాల కుర్చీలోనే ఉంటూ తన పని చేయాల్సి ఉంటుంది. దీనిని వివరిస్తూ ఆ మాజీ ఉద్యోగి తన వ్యాధి గురించి, దానితో పోరాడుతున్న విధానం గురించి వరుస ట్వీట్లు చేశారు. దీంతో అతడి వైకల్యం గురించి అసంబద్ధ వ్యాఖ్యలు చేసిన మస్క్‌ను చట్టప్రకారం శిక్షించాలని యూజర్లు ట్వీట్లతో విరుచుకుపడ్డారు. మంగళవారం సాయంత్రానికి తన తప్పును గుర్తించిన మస్క్.. హల్లిని క్షమాపణ కోరుతూ ట్వీట్ చేశారు. ‘అతడికి వీడియో కాల్ చేసి మాట్లాడా. ఇలాంటి విషయాల్లో ట్విటర్ కన్నా వీడియో కాల్స్‌నే ఆశ్రయించడం మంచిది’ అని చెప్పుకొచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Harish Shankar: ఉస్తాద్ భగత్‌సింగ్‌పై నెటిజన్ ట్వీట్.. డైరెక్టర్ కౌంటర్
-
Sports News
Virat Kohli: విరాట్ ‘జెర్సీ నంబరు 18’ వెనుక.. కన్నీటి కథ
-
Movies News
Farzi: ఓటీటీలో రికార్డు సృష్టించిన షాహిద్‌కపూర్ ‘ఫర్జీ’..!
-
General News
ISRO: నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Selfie: సెల్ఫీలు తీసుకున్న గాంధీ, థెరెసా, చెగువేరా