US: అమెరికాలో సంపన్నులపై పెరగనున్న పన్ను భారం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ దేశ బడ్జెట్‌ను గురువారం ప్రతిపాదించారు. 2024 ఆర్థిక సంవత్సరానికిగాను ఫెడరల్ ప్రభుత్వానికి సంబంధించి అందులో 6.9 లక్షల కోట్ల డాలర్ల వ్యయ ప్రతిపాదనలు చేశారు.
బడ్జెట్‌ను ప్రతిపాదించిన బైడెన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ దేశ బడ్జెట్‌ను గురువారం ప్రతిపాదించారు. 2024 ఆర్థిక సంవత్సరానికిగాను ఫెడరల్ ప్రభుత్వానికి సంబంధించి అందులో 6.9 లక్షల కోట్ల డాలర్ల వ్యయ ప్రతిపాదనలు చేశారు. రాబోయే దశాబ్ద కాలంలో ద్రవ్యలోటును 2.9 లక్షల కోట్ల డాలర్ల మేర తగ్గించే ప్రణాళికలను పొందుపరిచారు. తాజా బడ్జెట్‌లోని ప్రతిపాదనల ప్రకారం- దేశంలోని సంపన్నులపై పన్నుల భారాన్ని ప్రభుత్వం పెంచనుంది. 10 కోట్ల డాలర్లకు పైగా వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులపై కొత్త పన్ను విధించనుంది. ఏడాదికి 4 లక్షల డాలర్లకుపైగా ఆదాయం ఉన్న పౌరులు చెల్లించే పన్నులను తగ్గిస్తూ 2017లో అప్పటి ట్రంప్ సర్కారు కల్పించిన ఉపశమనాలను ప్రస్తుతం బైడెన్ ప్రభుత్వం వెనక్కి తీసుకోనుంది. అమెరికా ప్రతినిధుల సభలో ప్రస్తుతం రిపబ్లికన్లదే మెజార్టీ. వారు బైడెన్ బడ్జెట్ ప్రతిపాదనలను ఎంతమేరకు ఆమోదిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
‘ఇండో-పసిఫిక్’ కోసం 2,500 కోట్ల డాలర్లు
వ్యూహాత్మకంగా కీలకమైన ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును అడ్డుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్న అమెరికా.. తాజాగా కీలక ముందడుగు వేసింది. ఆ ప్రాంతంలో మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు, తమ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బడ్జెట్‌లో ఏకంగా 2,500 కోట్ల డాలర్ల నిధుల వ్యయానికి ప్రతిపాదించారు. చైనాకు ముకుతాడు వేయడానికి, అమెరికా సురక్షితంగా ఉండటానికి ఈ నిధులు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్
-
Movies News
RRR: ఎన్టీఆర్-రామ్‌చరణ్‌లతో నటించే అవకాశం వస్తే అది అదృష్టమే: హాలీవుడ్ స్టార్ హీరో