ఏడాది చిన్నారి మెదడులో పిండం!

చైనాలోని షాంఘైలో ఏడాది చిన్నారి మెదడులో నుంచి ఓ పిండాన్ని వైద్యులు బయటకు తీశారు. ఇలాంటి అరుదైన కేసును ‘ఫీటస్‌ ఇన్‌ ఫీటు’ అంటారని వైద్యులు చెబుతున్నారు.

Published : 11 Mar 2023 06:02 IST

చైనాలోని షాంఘైలో ఏడాది చిన్నారి మెదడులో నుంచి ఓ పిండాన్ని వైద్యులు బయటకు తీశారు. ఇలాంటి అరుదైన కేసును ‘ఫీటస్‌ ఇన్‌ ఫీటు’ అంటారని వైద్యులు చెబుతున్నారు. మొదట.. చిన్నారికి అనారోగ్యంగా ఉందని తల్లిందండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ చిన్నారి తలకు సంబంధించిన పలు సమస్యలతో బాధపడుతోందని వైద్యులు గుర్తించారు. దీంతోపాటు శరీర కండరాల్లో కదలికలు సరిగా లేవని గుర్తించారు. వెంటనే సిటీ స్కాన్‌ చేసి చూడగా.. మెదడులో పిండం ఉందని బయటపడింది. నాలుగు అంగుళాల పిండానికి పలు అవయవాలతోపాటు వేళ్ల గోర్లు కూడా అభివృద్ధి చెందాయని వైద్యులు తెలిపారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అవి చిన్నారి మెదడులో అభివృద్ధి చెంది ఉంటాయని భావిస్తున్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కవల పిల్లల్లో ఒక పిండం ఎదిగి, మరో పిండం ఎదగకపోతే ఇలాంటి సమస్యలు వస్తాయని వైద్యులు తెలిపారు. అంటే.. పిండాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు విభజన సరిగా జరగక.. ఒక పిండం మెదడులో మరో పిండం కలిసిపోయిందన్న మాట.  గర్భంలోని కవలల విభజన అసంపూర్ణంగా జరిగినందునే చిన్నారికి ఈ సమస్య వచ్చిందని శస్త్రచికిత్స చేసిన ఫుడాన్‌ వర్సిటీలోని హుయాసన్‌ హాస్పిటల్‌ న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ జోంజే తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని