యుద్ధాన్ని ఆపడమే లక్ష్యం..!

చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ ఈ నెల 20 నుంచి 22 వరకూ రష్యాలో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆహ్వానం మేరకు జిన్‌పింగ్‌ మాస్కోలో పర్యటించనున్నారని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్‌ శుక్రవారం వెల్లడించారు.

Published : 18 Mar 2023 05:47 IST

రష్యాలో 3 రోజులు పర్యటించనున్న చైనా అధ్యక్షుడు

బీజింగ్‌/మాస్కో: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ ఈ నెల 20 నుంచి 22 వరకూ రష్యాలో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆహ్వానం మేరకు జిన్‌పింగ్‌ మాస్కోలో పర్యటించనున్నారని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్‌ శుక్రవారం వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం దీర్ఘకాలంగా కొనసాగుతున్న తరుణంలో జిన్‌పింగ్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. యుద్ధానికి ముగింపు పలికే దిశగా పుతిన్‌తో జిన్‌పింగ్‌ కీలక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ‘‘రాజకీయ చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని మేము ఎప్పుడూ విశ్వసిస్తాం’’ అని చైనా విదేశాంగ శాఖకు చెందిన మరో అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇటీవలే మూడోసారి చైనా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జిన్‌పింగ్‌ చేస్తున్న ఈ తొలి విదేశీ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు