పుతిన్‌కు ఐసీసీ అరెస్ట్ వారెంట్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీసీ) అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ‘‘ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు పిల్లలను చట్టవిరుద్ధంగా పంపించడం తదితర నేరాలకు పుతిన్ బాధ్యుడు’’ అందుకే ఆయన్ను అరెస్టు చేసేందుకు వారెంట్ జారీ చేశాం అని ఐసీసీ స్పష్టం చేసింది.
ఆమోదయోగ్యంకాని చర్యగా అభివర్ణించిన రష్యా
ది హేగ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీసీ) అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ‘‘ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు పిల్లలను చట్టవిరుద్ధంగా పంపించడం తదితర నేరాలకు పుతిన్ బాధ్యుడు’’ అందుకే ఆయన్ను అరెస్టు చేసేందుకు వారెంట్ జారీ చేశాం అని ఐసీసీ స్పష్టం చేసింది. అంతేకాకుండా రష్యా బాలల హక్కుల కమిషనర్ మారియా ల్వోవా బెలోవాకు కూడా అరెస్ట్ వారెంట్ ఇచ్చినట్లు ఐసీసీ వెల్లడించింది. ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల్లోని చిన్నారులను రష్యాకు చట్టవిరుద్ధంగా రవాణా చేస్తూ యుద్ధ నేరాలకు పాల్పడినందుకు ప్రతి అనుమానితుడు బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా ఐసీసీ ప్రీ ట్రయల్ ఛాంబర్ అభిప్రాయపడింది. భద్రతామండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాల్లో ఓ దేశం అధినేతకు ఇలా వారెంటు జారీకావడం ఇదే మొదటిసారి.
* గతంలో ఐసీసీ అరెస్టు వారెంట్ జారీచేసిన వారిలో సెర్బియా మాజీ అధ్యక్షుడు స్లొబొదన్ మిలోసెవిక్, సెర్బియా సైనిక మాజీ కమాండర్ రాట్‌కో మ్లాడిక్, లైబీరియా మాజీ అధినేత చార్లెస్ టైలర్ ఉన్నారు.
* ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై రష్యా స్పందించింది. ఇది దారుణమైన, ఆమోదయోగ్యం కాని వ్యవహారమని అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. తాము ఐసీసీని గుర్తించడం లేదని, అందువల్ల దాని చర్యలు చట్టపరంగా చెల్లుబాటుకావని పేర్కొనారు. కాగా ఐసీసీ చర్యను ఉక్రెయిన్ స్వాగతించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
ISI: పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ రెండో ర్యాంక్ స్థాయి అధికారి హతం..!
-
India News
Amritpal Singh: 45 నిమిషాలు గురుద్వారాలో ఉండి.. పూజారి ఫోన్ వాడి..!
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Dhamki: ‘ధమ్కీ’కి బదులు ఆ సినిమా వేసిన థియేటర్ సిబ్బంది.. ప్రేక్షకులు షాక్
-
Politics News
Kishan Reddy: ఈ ఏడాది దేశానికి, తెలంగాణకు కీలకం: కిషన్‌రెడ్డి
-
Crime News
TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్.. లావాదేవీలపై సిట్ ఆరా