ఆస్ట్రేలియాకు 220 టోమహాక్ క్షిపణులు
ఆస్ట్రేలియాకు 220 టోమహాక్ దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణులను సరఫరా చేయనున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇప్పటికే ఆ దేశానికి అణు జలాంతర్గాములను సమకూర్చాలని ‘ఆకస్’ (ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా).
అమెరికా నిర్ణయం
చైనాకు చెక్ పెట్టేందుకే..
వాషింగ్టన్: ఆస్ట్రేలియాకు 220 టోమహాక్ దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణులను సరఫరా చేయనున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇప్పటికే ఆ దేశానికి అణు జలాంతర్గాములను సమకూర్చాలని ‘ఆకస్’ (ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా) కూటమి నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. టోమహాక్ క్షిపణులను సబ్‌మెరైన్లు, యుద్ధనౌకల్లో వినియోగించే అవకాశం ఉంది. చైనాను లక్ష్యంగా చేసుకొని ఈ ఆయుధాలను అగ్రరాజ్యం సరఫరా చేస్తోంది. ‘‘ఈ క్షిపణి విక్రయాలతో అమెరికా, ఇతర మిత్రదేశాల దళాలతో ఆస్ట్రేలియా సమన్వయం చేసుకొంటూ..ఉమ్మడి ప్రయోజనాలను కాపాడే ఆపరేషన్లను విజయవంతంగా చేయగలదు’’ అని అమెరికా రక్షణ భద్రత సహకార సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఒప్పందం విలువ 89.5 కోట్ల డాలర్లు అని తెలిపింది. 2033 నాటికి తమకు మూడు వర్జీనియా శ్రేణి జలాంతర్గాములు అందుతాయని ఆస్ట్రేలియా రక్షణ మంత్రి పాట్ కాన్రే తెలిపారు. అప్పటికి టోమహాక్ క్షిపణులూ అందుబాటులో వస్తాయన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
RRR: ‘ఆస్కార్’కు అందుకే వెళ్లలేదు.. ఆ ఖర్చు గురించి తెలియదు: ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత
-
Politics News
Andhra News: వైకాపాతో భాజపా కలిసిపోయిందనే ప్రచారం.. నష్టం చేసింది: భాజపా నేత మాధవ్
-
Movies News
Actress Hema: సెలబ్రిటీలపై అసత్య ప్రచారం.. సైబర్ క్రైమ్‌లో సినీనటి హేమ ఫిర్యాదు
-
India News
Manish Sisodia: భార్యకు అనారోగ్యం.. కొడుకు విదేశాల్లో.. బెయిల్ ఇవ్వండి: సిసోదియా
-
General News
Telangana Jobs: గుడ్ న్యూస్.. జీహెచ్ఎంసీ పరిధిలో 1,540 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్!
-
Sports News
MIW vs RCBW: విజృంభించిన ముంబయి బౌలర్లు.. స్వల్ప స్కోరుకే పరిమితమైన ఆర్సీబీ