సంక్షిప్త వార్తలు(2)

ఈబీ 1, 2, 3 కేటగిరీల్లో ఐ140 వీసా పిటిషన్లకు ఆమోదముద్ర పడినవారికి ఉద్యోగ సమ్మతి పత్రాలను, ప్రయాణ పత్రాలను ఇచ్చే అంశంపై అమెరికా అధ్యక్షుడి సలహా సంఘం ఒకటి చర్చించింది.

Updated : 18 Mar 2023 09:34 IST

ఉక్రెయిన్‌కు 13యుద్ధ విమానాలిస్తాం

స్లొవేకియా ప్రకటన

బ్రాటిస్లావా: రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు 13 మిగ్‌-29 యుద్ధ విమానాలను అందిస్తున్నట్లు స్లొవేకియా శుక్రవారం ప్రకటించింది. రష్యాతో పోరాడటానికి సాయపడతామంటూ ఉక్రెయిన్‌కు ఇచ్చిన మాటను  ఇలా నిలబెట్టుకుంటున్నామని ప్రధాని ఎడ్వర్డ్‌ హెగెర్‌ తెలిపారు. పోలండ్‌ కూడా ఉక్రెయిన్‌కు డజను మిగ్‌ 29 ఫైటర్లను ఇస్తామని గురువారం ప్రకటించింది.


లాహోర్‌ హైకోర్టులో ఇమ్రాన్‌కు ఉపశమనం

లాహోర్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ (70)కు శుక్రవారం లాహోర్‌ హైకోర్టు నుంచి గొప్ప ఉపశమనం లభించింది. 8 ఉగ్రవాద కేసులు, ఓ సివిల్‌ కేసులో ఆయనకు రక్షణ బెయిలు మంజూరు చేస్తూ న్యాయమూర్తులు ఆదేశాలు జారీ చేశారు. ఇస్లామాబాద్‌లో దాఖలైన అయిదు కేసుల్లో మార్చి 24 దాకా, లాహోర్‌లో దాఖలైన మరో మూడు కేసుల్లో మార్చి 27 దాకా కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది. ఈ తీర్పు వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే.. అవినీతి కేసులో ఇమ్రాన్‌పై ఉన్న నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్లను మార్చి 18 దాకా అమలు చేయరాదంటూ ఇస్లామాబాద్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.


చిత్ర వార్త


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు