21న నన్ను అరెస్టు చేస్తారు: ట్రంప్‌

తనతో లైంగిక సంబంధాలున్నాయని ఆరోపించిన మహిళను డబ్బులతో ప్రలోభపెట్టినట్లు వచ్చిన అభియోగాల నేపథ్యంలో ఈ నెల 21న తనను అరెస్టు చేసే అవకాశాలున్నాయని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుమానం వ్యక్తంచేశారు.

Updated : 19 Mar 2023 06:04 IST

న్యూయార్క్‌: తనతో లైంగిక సంబంధాలున్నాయని ఆరోపించిన మహిళను డబ్బులతో ప్రలోభపెట్టినట్లు వచ్చిన అభియోగాల నేపథ్యంలో ఈ నెల 21న తనను అరెస్టు చేసే అవకాశాలున్నాయని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుమానం వ్యక్తంచేశారు. ‘ట్రూత్‌ సోషల్‌’ నెట్‌వర్క్‌లో ఈ మేరకు ఆయన శనివారం పోస్ట్‌ చేశారు. మన్‌హట్టన్‌ జిల్లా అటార్నీ కార్యాలయం నుంచి అనధికారికంగా వచ్చిన సమాచారం ప్రకారం తాను అరెస్టు అయ్యేలా ఉన్నానని చెప్పారు. గతసారి అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాన్ని జో బైడెన్‌ దొంగిలించుకుపోయారని మరోసారి ఆరోపిస్తూ- దేశాన్ని మళ్లీ మునుపటి స్థితికి తెచ్చేందుకు నిరసనలు తెలపాలని అనుచరులకు విజ్ఞప్తిచేశారు. లైంగిక సంబంధాల ఆరోపణల్ని ట్రంప్‌ ఇదివరకే తోసిపుచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు