వేసవిలో మోదీకి బైడెన్‌ ఆతిథ్యం

ఈసారి వేసవిలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా తరఫున విందు ఏర్పాటు చేసేందుకు ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Updated : 19 Mar 2023 06:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈసారి వేసవిలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా తరఫున విందు ఏర్పాటు చేసేందుకు ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమం జూన్‌లో నిర్వహించాలని శ్వేతసౌధం భావిస్తోంది. ఈ అంశంపై మాట్లాడేందుకు అమెరికా జాతీయ భద్రతా సమితి నిరాకరించింది. స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్‌ కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా భారత్‌-అమెరికా మధ్య బలపడుతున్న బంధానికి ఈ విందు ఓ కీలక సంకేతంగా నిలవనుంది. ఇప్పటికే గత నెలలో బైడెన్‌ సర్కార్‌ భారత్‌తో ఇనీషియేటీవ్‌ ఆన్‌ క్రిటికల్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీ కార్యక్రమాన్ని ప్రకటించింది. దీని కింద కంప్యూటింగ్‌, జెట్‌ ఇంజిన్ల సంయుక్త అభివృద్ధి వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఇటీవల కాలంలో బైడెన్‌ ప్రభుత్వం విదేశీ అతిథులకు ఇచ్చే మూడో విందుగా ఇది నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే డిసెంబరులో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌కు ఆతిథ్యం ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు