వుహాన్‌ సమాచారంపై చైనాను తప్పుబట్టిన డబ్ల్యూహెచ్‌వో

వుహాన్‌ మార్కెట్‌లో సేకరించిన నమూనాల సమాచారాన్ని జీఐఎస్‌ఏఐడీ డేటాబేస్‌ నుంచి చైనా తొలగించడాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తప్పుబట్టింది.

Updated : 19 Mar 2023 05:57 IST

జెనీవా: వుహాన్‌ మార్కెట్‌లో సేకరించిన నమూనాల సమాచారాన్ని జీఐఎస్‌ఏఐడీ డేటాబేస్‌ నుంచి చైనా తొలగించడాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తప్పుబట్టింది. కొవిడ్‌ వైరస్‌ మూలాలు తెలుసుకోవడానికి ఈ సమాచారం అవసరమని,  ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌-19 మూలాలకు సంబంధించి జరిపిన ప్రతి పరిశోధన సమాచారాన్ని అంతర్జాతీయ సమాజానికి అందుబాటులో ఉంచాలని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ చైనాకు శుక్రవారం స్పష్టం చేశారు. వుహాన్‌ మార్కెట్‌లో ఉంచిన రకూన్‌ శునకాల జన్యు అవశేషాల్లో కొవిడ్‌ వైరస్‌ ఉన్నట్లు గుర్తించామని అంతర్జాతీయ పరిశోధకుల బృందం తాజాగా ప్రకటించింది. ఆ వెంటనే కొవిడ్‌ మూలాలపై అధ్యయనం చేయడానికి ఏర్పాటైన అంతర్జాతీయ వేదిక ‘జీఐఎస్‌ఏఐడీ’ డేటాబేస్‌ నుంచి గతంలో తాను ఇచ్చిన సమాచారాన్ని చైనా తొలగించింది. ఈ పరిణామాల నేపద్యంలో టెడ్రోస్‌ స్పందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు