ఆస్ట్రేలియాలో లక్షల్లో చేపల మృత్యువాత

లక్షల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. కిలోమీటర్ల మేర నదిలో ఎక్కడ చూసినా నిర్జీవంగా తేలియాడుతోన్న చేపల దృశ్యాలే.

Published : 19 Mar 2023 04:26 IST

కాన్‌బెర్రా: లక్షల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. కిలోమీటర్ల మేర నదిలో ఎక్కడ చూసినా నిర్జీవంగా తేలియాడుతోన్న చేపల దృశ్యాలే. ఆస్ట్రేలియా న్యూ సౌత్‌వేల్స్‌లోని మెనిండీ సమీపం డార్లింగ్‌ నదిలో ఈ పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. వరద నీరు తగ్గుముఖం, వేడి వాతావరణం కారణంగా నీటిలో ఆక్సిజన్‌ శాతం పడిపోవడమే చేపల మృత్యువాతకు కారణమని అధికారులు చెబుతున్నారు. ఇటీవలి వరదల తరువాత నదిలో చేపల సంఖ్య విపరీతంగా పెరిగిందని, ఇప్పుడు వరద తగ్గుముఖం పట్టడంతో భారీ సంఖ్యలో చనిపోతున్నాయని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు