చైనాను చూసి భయపడటం లేదు
చైనాను చూసి భారత్ భయపడటం లేదని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. డ్రాగన్‌ను చూసి కేంద్రం పదే పదే వెనుకడుగు వేస్తోందని ఇంగ్లాండ్ పర్యటనలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
ఆ దేశంతో సంబంధాలు ప్రమాదకరంగానే ఉన్నాయి: జైశంకర్
దిల్లీ: చైనాను చూసి భారత్ భయపడటం లేదని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. డ్రాగన్‌ను చూసి కేంద్రం పదే పదే వెనుకడుగు వేస్తోందని ఇంగ్లాండ్ పర్యటనలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తాము ఎవరికీ భయపడటం లేదన్నారు. అయితే చైనాతో సంబంధాలైతే సాధారణంగా లేవని చాలా ప్రమాదకరంగా ఉన్నాయని తెలిపారు. శనివారం ఆయన ‘ఇండియా టుడే’ నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ.. వాస్తవాధీనరేఖ వెంబడి కొన్ని స్థానాల్లో ఇరు దేశాలు ఎదురుబొదురుగా మోహరించి ఉన్నాయని, సైనికపరంగా ఇది ప్రమాదకరమైన స్థితి అని వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో శాంతి, సామరస్యం లేకుండా, మిగతా రంగాల్లో సాధారణ సంబంధాలు కొనసాగిద్దామని చైనా అంటోందని, అది కుదరదని తాము స్పష్టంగా ఆ దేశానికి చెప్పినట్లు జైశంకర్ తెలిపారు. చైనా విషయంలో రాహుల్ రాజకీయాలు చేస్తున్నారని, విదేశాల్లో భారత్ నైతికస్థైర్యం దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి కొనసాగుతున్న చైనా బెల్ట్ అండ్ రోడ్ కార్యక్రమాన్ని యెల్లో రివర్‌తో రాహుల్ పోల్చడాన్ని తప్పుపట్టారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
సమస్యలు అడిగితే చెప్పుతో కొడతా.. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి
-
World News
82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో
-
World News
‘బ్లూటూత్’తో మెదడు, వెన్నెముకల అనుసంధానం!.. నడుస్తున్న పక్షవాత బాధితుడు
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
వనపర్తి జిల్లాలో ఇనుము ఉత్పత్తి క్షేత్రం ఆనవాళ్లు