చైనా నది మధ్యలో 4.4 కి.మీ.ల హైవే

నది దాటడానికి అనుకూలంగా వంతెన నిర్మించడం సర్వసాధారణం. నది మధ్యలో 4.4 కిలోమీటర్ల హైవే నిర్మాణం ఊహించగలమా! ఈ అద్భుతాన్ని చైనా ఇంజినీర్లు చేసి చూపించారు. 2015 నుంచి ఈ మార్గంలో వేలాది వాహనాలు రయ్‌రయ్‌మంటూ దూసుకుపోతున్నాయి.

Published : 20 Mar 2023 04:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నది దాటడానికి అనుకూలంగా వంతెన నిర్మించడం సర్వసాధారణం. నది మధ్యలో 4.4 కిలోమీటర్ల హైవే నిర్మాణం ఊహించగలమా! ఈ అద్భుతాన్ని చైనా ఇంజినీర్లు చేసి చూపించారు. 2015 నుంచి ఈ మార్గంలో వేలాది వాహనాలు రయ్‌రయ్‌మంటూ దూసుకుపోతున్నాయి. జింగ్‌షాన్‌ కౌంటీలోని గుఫుచెన్‌ను షాంఘై, చెంగ్డు మధ్యలోని ప్రధాన హైవేతో అనుసంధానం చేయడానికి చైనా ప్రభుత్వం నది పొడవునా పలు వంతెనలతో ఈ హైవే నిర్మించింది. ఈ ‘రివర్‌ హైవే’కు సమాంతరంగా ముందే రోడ్డు ఉంది. మరి నది మధ్యలో హైవే నిర్మించాల్సిన అవసరం ఏముందని అనుకొంటున్నారా? పాత రోడ్డును వెడల్పు చేయాలంటే కొత్తగా చాలాచోట్ల సొరంగాలు తవ్వాల్సి ఉంటుంది. కొండలు బద్దలు గొట్టాలి. ఇళ్లు ఖాళీ చేయించాలి. ఈ వ్యయ ప్రయాసలతో పోల్చుకుంటే నది మధ్యలో వంతెన నిర్మించడమే సులభమని చైనా ఇంజినీర్లు భావించారు. హుబీ ప్రావిన్స్‌లోని జియాంగ్జీ నది పలు వంపులు తిరుగుతూ పర్వతాల గుండా సాగుతుంది. సాధారణ హైవేతో పోలిస్తే ఈ మార్గంలో ‘రివర్‌ హైవే’ నిర్మించడం వల్ల వ్యయం బాగా తగ్గింది. మొత్తానికి రూ.585 కోట్లలో ఈ ప్రాజెక్టు పూర్తయింది. గత ఎనిమిదేళ్లలో ఈ ‘రివర్‌ హైవే’ ఓ పర్యాటక ప్రాంతంగానూ మారిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని