28 ఏళ్లకే 9 మందికి జన్మ.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌

ఓ మహిళ 28 ఏళ్ల వయసుకే తొమ్మిది మందికి జన్మనిచ్చింది. అమెరికాలోని నెవాడా రాష్ట్రానికి చెందిన 39 ఏళ్ల కోరా డ్యూక్‌ 2001లో పదిహేడేళ్ల వయసులో తొలిసారి గర్భం దాల్చింది.

Updated : 20 Mar 2023 04:53 IST

ఓ మహిళ 28 ఏళ్ల వయసుకే తొమ్మిది మందికి జన్మనిచ్చింది. అమెరికాలోని నెవాడా రాష్ట్రానికి చెందిన 39 ఏళ్ల కోరా డ్యూక్‌ 2001లో పదిహేడేళ్ల వయసులో తొలిసారి గర్భం దాల్చింది. 2012లో చివరిసారిగా బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తన భర్త ఆండ్రే డ్యూక్‌తో పాటు 8 మంది సంతానంతో కలిసి నివసిస్తోంది. వీరికి పుట్టిన మూడో సంతానం ఏడు రోజులకే కన్నుమూసింది. ఇటీవల తన సంతానంతో కలిసి కోరా చేసిన ఓ టిక్‌టాక్‌ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పిల్లలను వయసుల వారీగా నిల్చోబెట్టి వారిని పరిచయం చేస్తూ తీసిన ఆ వీడియో నెటిజన్లను ఆకర్షించింది. కావాలని ఇంత మంది పిల్లలను కనలేదని కోరా చెబుతోంది. సంప్రదాయ కుటుంబ నియంత్రణ పద్ధతులు విఫలం కావడం వల్లే ఇన్ని సార్లు గర్భం ధరించినట్లు తెలిపింది. తొమ్మిదో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత శాశ్వత కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్నట్లు చెప్పింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని