కాలిఫోర్నియా నింగిలో కాంతిచారలు
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఆకాశాన వింత కాంతి చారలు దర్శనమిచ్చాయి. అవేంటన్నది అర్థంకాని ప్రజలు వాటి వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.
అంతరిక్ష వ్యర్థం మండిపోవడమే కారణమంటున్న శాస్త్రవేత్తలు
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఆకాశాన వింత కాంతి చారలు దర్శనమిచ్చాయి. అవేంటన్నది అర్థంకాని ప్రజలు వాటి వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. కొద్దిసేపట్లోనే అవి అదృశ్యమయ్యాయని జేమీ హెర్నాండెజ్ అనే వ్యక్తి పేర్కొన్నారు. గతంలో తాను ఇలాంటి పరిమాణాన్ని చూడలేదని పేర్కొన్నారు. అయితే అంతరిక్షం నుంచి వచ్చిపడ్డ శకలాలు భూవాతావరణంలో మండిపోవడం వల్లే ఆ కాంతి చారలు ఏర్పడి ఉంటాయని జోనాథన్ మెక్‌డోవెల్ అనే ఖగోళశాస్త్రవేత్త పేర్కొన్నారు. భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో జపాన్‌కు చెందిన ఒక కమ్యూనికేషన్ సాధనం ఉండేదన్నారు. అది సమాచారాన్ని తొలుత ఒక ఉపగ్రహానికి, ఆ తర్వాత భూమికి చేరవేసేదని చెప్పారు. దాని బరువు 310 కిలోలని, దాన్ని 2020లో ఐఎస్‌ఎస్ నుంచి జారవిడిచారని వివరించారు. అది ఇప్పుడు భూ వాతావరణంలోకి ప్రవేశించి, మండిపోయి ఉంటుందని తెలిపారు. ఆ పరిణామం కాంతిచారల్లా కనిపించాయని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Hyderabad: రెండు స్థిరాస్తి సంస్థలకు భారీగా జరిమానా విధించిన రెరా
-
Gunniness Record: ఒక్కరోజే 3,797 ఈసీజీలు.. గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్‌లో చోటు
-
Chiru 157: చిరంజీవిని అలా చూపించాలనుకుంటున్నా: దర్శకుడు వశిష్ఠ