చిరునవ్వుల చిరునామా ఫిన్లాండ్‌

ఫిన్లాండ్‌ ఎప్పటి మాదిరిగానే ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో అగ్రభాగాన నిలిచింది. ఆరుదఫాలుగా  అదే స్థానంలో కొనసాగుతోంది.

Updated : 21 Mar 2023 06:26 IST

హ్యాపీనెస్‌ ర్యాంకుల్లో మరోసారి అగ్రస్థానం
భారత్‌కు 125వ ర్యాంకు

న్యూయార్క్‌: ఫిన్లాండ్‌ ఎప్పటి మాదిరిగానే ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో అగ్రభాగాన నిలిచింది. ఆరుదఫాలుగా  అదే స్థానంలో కొనసాగుతోంది. ‘అంతర్జాతీయ ఆనంద దినోత్సవ’మైన సోమవారం(మార్చి 20న) యూఎన్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ సొల్యూషన్స్‌ నెట్‌వర్క్‌ తాజా ర్యాంకులను విడుదల చేసింది. ప్రపంచంలోని 150కి పైగా దేశాల ప్రజల మనోభావాలను తెలుసుకునే గ్లోబల్‌ సర్వే డేటా ఆధారంగా రూపొందించిన నివేదిక ఇది.   సంతోష సూచీల్లో నార్డిక్‌ దేశాలైన ఫిన్లాండ్‌(1), డెన్మార్క్‌(2), ఐస్‌లాండ్‌(3) వరుసగా తొలి మూడు ర్యాంకులను దక్కించుకున్నాయి. భారత్‌ 125వ స్థానంలో నిలిచింది. అయితే, నేపాల్‌, చైనా, బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశాలు ఈ విషయంలో మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు